ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 10, 2020 , 16:21:50

నటితో పృథ్వీ షా డేటింగ్!

నటితో పృథ్వీ షా  డేటింగ్!

న్యూఢిల్లీ:  ఐపీఎల్‌లో  ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో యువ ప్లేయర్‌ పృథ్వీ షా(20) కీలకపాత్ర పోషించనున్నాడు.  రాబోయే 13వ సీజన్‌లో  సత్తాచాటేందుకు షా ముమ్మరంగా సాధన చేస్తున్నాడు.  తాజాగా టీవీ, ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన యువ నటితో పృథ్వీ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది.  కలర్స్‌ టీవీలో ప్రసారమయ్యే ఉడాన్‌ సిరీయల్‌లో నటి ప్రాచి సింగ్‌ నటించింది.  సోషల్‌మీడియాలో వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వీరి డేటింగ్ రిలేషన్ గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకరి పోస్ట్‌కు మరొకరు తప్పకుండా కామెంట్‌ లేదా ఎమోజీతో రీప్లే ఇస్తున్నారు. 


logo