శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 04, 2020 , 20:21:56

దేశం తరఫున ఆడటం కంటే ఐపీఎల్‌ ముఖ్యమా?

దేశం తరఫున ఆడటం కంటే ఐపీఎల్‌   ముఖ్యమా?

ముంబై:  తొడకండరాల గాయం నుంచి కోలుకున్న ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బరిలో దిగాడు.  గాయంతో వరుసగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన    రోహిత్ ఐపీఎల్‌లో‌   మళ్లీ ఆడటాన్ని మాజీ చీఫ్‌ సెలక్టర్‌, మాజీ భారత కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ప్రశ్నించారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే  లీగ్‌ ముఖ్యమా అని అడిగారు.

'అసలు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భారత జాతీయ జట్టుకు ఆడటం కంటే ఐపీఎల్‌ అతనికి ముఖ్యమా?  దేశం కోసం ఆడటం కన్నా క్లబ్‌ ముఖ్యమా? దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుంది.  రోహిత్‌ గాయాన్ని సరిగ్గా గుర్తించడంలో బీసీసీఐ ఫిజియో ఏదైనా పొరపాటు చేశారా?' అని వెంగ్‌సర్కార్‌ ప్రశ్నించారు. రోహిత్‌కు గాయమైందని     బీసీసీఐ సెలక్టర్లు అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు  ఎంపిక చేయని విషయం తెలిసిందే.