గురువారం 09 జూలై 2020
Sports - Apr 12, 2020 , 23:39:38

తండ్రితో కలిసి హైలెట్స్ చూసిన పఠాన్

తండ్రితో కలిసి హైలెట్స్ చూసిన పఠాన్

వడోదర: 2007 టీ20 ప్రపంచకప్​ను టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేసుకున్నాడు. పాకిస్థాన్​తో జరిగిన ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్​ను తన తండ్రి మహమ్మద్ ఖాన్ పఠాన్​తో కలిసి చూశాడు. ఆ మ్యాచ్​లో పాక్ బ్యాట్స్​మన్​ యూనిస్​ ఖాన్​ను ఇర్ఫాన్ బౌల్డ్ చేశాడు. హైలెట్స్​లో ఈ దృశ్యం వచ్చినప్పుడు ఇర్ఫాన్ తండ్రి పెద్దగా నవ్వాడు. ఆయన సంతోషం వెలకట్టలేనిదంటూ తండ్రితో కలిసి హైలెట్స్ చూసిన వీడియోను ఇర్ఫాన్ పఠాన్ ఆదివారం ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు.

దక్షిణాఫ్రికాలోని జొహనెస్​బర్గ్ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్​లో ఇర్ఫాన్ పఠాన్ 4ఓవర్లు వేసి 16మాత్రమే 3వికెట్లు తీసి, జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్​ 157 పరుగులు చేయగా పాకిస్థాన్​ 152పరుగులకే పరిమితమైంది. దీంతో తొలి టీ20 ప్రపంచకప్​ను ధోనీ సారథ్యంలో టీమ్​ఇండియా కైవసం చేసుకుంది. 


logo