బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 06, 2020 , 00:20:45

ఇంగ్లండ్‌కు ఐర్లాండ్‌ షాక్‌

 ఇంగ్లండ్‌కు ఐర్లాండ్‌ షాక్‌

సౌతాంప్టన్‌: వన్డే ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు ఐర్లాండ్‌ షాక్‌ ఇచ్చింది. భారీ టార్గెట్‌ ఛేదించి ఔరా అనిపించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 328 పరుగులకు ఆలౌట్‌ కాగా.. లక్ష్యఛేదనలో స్టిర్లింగ్‌ (142; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), బాల్‌బిర్నీ (113; 12 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో ఐర్లాండ్‌ 49.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 329 పరుగులు చేసింది. ఐరిష్‌ జట్టుకు ఇంగ్లండ్‌పై ఇది రెండో విజయం కావడం విశేషం. భారత్‌లో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌పై సరిగ్గా ఇన్నే పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్‌ ఛేదించింది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఇంగ్లండ్‌ 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. స్టిర్లింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', డేవిడ్‌ విల్లేకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డులు దక్కాయి.


logo