మంగళవారం 07 జూలై 2020
Sports - May 27, 2020 , 18:10:24

'ఐపీఎల్‌ జరుగాలని కోరుకునేందుకు చాలా కారణాలున్నాయి'

'ఐపీఎల్‌ జరుగాలని కోరుకునేందుకు చాలా కారణాలున్నాయి'

సిడ్నీ: ఈ ఏడాది తమ దేశంలో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ ఒకవేళ వాయిదా పడితే.. ఆ సమయంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ నిర్వహిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ జరుగాలని తాను కోరుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయని బుధవారం చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు కమిన్స్‌ను రూ.15.5కోట్లు వెచ్చించి దక్కించుకుంది. దీంతో అత్యంత విలువైన విదేశీ ఆటగాడిగా అతడు నిలిచాడు.

"ఐపీఎల్‌ జరుగాలని నేను కోరుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ టోర్నీని చూస్తారు. క్రికెట్‌ చాలా కాలంగా నిలిచిపోయాక ఐపీఎల్‌ జరిగితే మరింత ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఈ టోర్నీ చాలా గొప్పది" అని కమిన్స్‌ చెప్పాడు. వీలైంత త్వరగా మళ్లీ క్రికెట్‌ ఆడాలని తాను ఎదురుచూస్తున్నానని అతడు అన్నాడు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌ 18వ తేదీ నుంచి నవంబర్‌ 15వ వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా టోర్నీ వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తున్నది.  


logo