సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 27, 2020 , 20:17:27

ఐపీఎల్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌, నోబాల్‌ ఇక థర్డ్‌ అంపైర్‌ చేతుల్లో..

ఐపీఎల్‌లో   కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌, నోబాల్‌ ఇక థర్డ్‌ అంపైర్‌ చేతుల్లో..

 న్యూఢిల్లీ:   ఐపీఎల్‌-2020 ఫైనల్‌ మే 24న ముంబైలోనే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపారు. దాంతో పాటు రాత్రి సమయాల్లో జరిగే ఐపీఎల్‌  మ్యాచ్‌ల సమయాల్లోనూ ఎలాంటి మార్పులేదని గత సీజన్ల మాదిరిగానే  రాత్రి 8 గంటలకే మ్యాచ్‌లను ప్రారంభించాలని  నిర్ణయించినట్లు  గంగూలీ వెల్లడించారు. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌లను ప్రారంభించాలనే ప్రతిపాదనపై  చర్చించామని కానీ, అది జరగలేదని దాదా తెలిపారు.  ఐతే వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కేవలం 5సార్లు మాత్రమే ఒకే రోజు (4pm and 8 pm)  రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని చెప్పారు.  

రాబోయే ఐపీఎల్‌లో తొలిసారి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌తో పాటు నో బాల్‌ను గుర్తించేందుకు   'థర్డ్‌ అంపైర్‌'ను ప్రవేశపెట్టేందుకు  ఐపీఎల్‌ పాలక మండలి ఆమోదం తెలిపింది.   ఫ్రంట్ ఫుట్ నోబాల్‌ను ఇకపై థర్డ్ అంపైర్ ధ్రువీకరించనున్నాడు. ఐపీఎల్‌ ఆరంభానికి ముందు మూడు రోజుల పాటు ఐపీఎల్‌ ఆల్‌స్టార్స్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తామని గంగూలీ చెప్పారు.  క్రికెట్‌ సలహా కమిటీ (సీఏపీ) సభ్యులుగా మాజీ క్రికెటర్లు మదన్‌లాల్‌, సులక్షణా మధుకర్‌ నాయక్‌ను బీసీసీఐ నియమించింది.   ఈ   కమిటీ.. జాతీయ సెలెక్షన్‌ కమిటీని ఎంపిక చేయనుంది. గౌతమ్‌ గంభీర్‌ను కమిటీలోకి తీసుకోలేదని, బీసీసీఐ సెక్రటరీ జైషా సీఏసీపై పూర్తి వివరాలు వెల్లడిస్తారని దాదా చెప్పుకొచ్చారు. 


logo