ఆదివారం 17 జనవరి 2021
Sports - Dec 03, 2020 , 13:36:18

ఐపీఎల్‌లోకి రెండు కొత్త టీమ్స్‌.. డిసెంబ‌ర్ 24న బీసీసీఐ ప్ర‌క‌ట‌న‌!

ఐపీఎల్‌లోకి రెండు కొత్త టీమ్స్‌.. డిసెంబ‌ర్ 24న బీసీసీఐ ప్ర‌క‌ట‌న‌!

ముంబై: వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లోకి రెండు కొత్త టీమ్స్ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ మేర‌కు డిసెంబ‌ర్ 24న జ‌ర‌గబోయే వార్షిక సర్వ‌సభ్య స‌మావేశంలో బీసీసీఐ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ స‌మావేశం కోసం 23 పాయింట్ల‌తో ఎజెండాను కూడా బోర్డు సిద్ధం చేసింది. 2020 ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వ‌హించ‌డం ద్వారా వ‌చ్చిన న‌ష్టాన్ని ఈ కొత్త టీమ్స్‌తో రాబ‌ట్టుకోవాల‌న్న‌ది బీసీసీఐ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ కొత్త టీమ్స్ కోసం పూర్తి స్థాయి వేలానికి సిద్ధంగా ఉండాల‌ని అన్ని ఫ్రాంచైజీల‌కు బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ సందేశం పంపించారు. వ‌చ్చే ఏడాది మొద‌ట్లోనే ఈ వేలం ఉండే అవ‌కాశం ఉంది. అయితే ఐపీఎల్‌లోకి వ‌చ్చే ఆ జ‌ట్లు ఏవి అన్నిదానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందులో ఒక టీమ్ క‌చ్చితంగా అహ్మ‌దాబాద్ నుంచి ఉంటుంద‌ని ఇప్ప‌టికే చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా మారిన మొతెరానే ఈ టీమ్‌కు హోమ్ గ్రౌండ్‌గా ఉంటుంద‌నీ ఆ వార్త‌లు తేల్చేశాయి. మ‌రోవైపు కొత్త టీమ్ కోసం మోహ‌న్‌లాల్‌, స‌ల్మాన్ ఖాన్ కూడా పోటీ ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.