సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 01, 2020 , 16:15:36

ఐపీఎల్‌ జట్లకు గుడ్‌న్యూస్‌..క్వారంటైన్‌ లేకుండానే!

ఐపీఎల్‌ జట్లకు గుడ్‌న్యూస్‌..క్వారంటైన్‌ లేకుండానే!

దుబాయ్‌:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) జట్లు తమ మ్యాచ్‌ల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లినప్పుడు  తమను తాము క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) వర్గాలు మంగళవారం ధ్రువీకరించాయి.  ఐపీఎల్‌ టీమ్‌లు క్వారంటైన్‌కు వెళ్లకుండానే నేరుగా మ్యాచ్‌ వేదికలకు వెళ్లొచ్చు.  ఐపీఎల్‌ 2020 షెడ్యూల్‌ ఇంకా వెలువడనప్పటికీ, అనూహ్యంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అబుదాబికి వెళ్లే జట్లను క్వారంటైన్‌లో  ఉండాలని అక్కడి అధికారులు కోరే అవకాశం ఉండటంతో ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. 

'దుబాయ్‌, అబుదాబి, షార్జాలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు అవసరమైన అన్ని అనుమతులను పొందాం.  సంబంధిత అధికారులు ఒక ప్రొటోకాల్‌ను రూపొందించారు.  కొత్త నిబంధనలతో జట్లన్నీ నేరుగా మ్యాచ్‌ వేదికలకు వెళ్లొచ్చు.    మ్యాచ్‌ అనంతరం  క్వారంటైన్‌ లేకుండానే   మళ్లీ నేరుగా వారు బసచేసే హోటళ్లకు వెళ్లొచ్చేలా నిబంధనలు ఉన్నట్లు' ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు వర్గాలు వివరించాయి. 

'బీసీసీఐ ప్రొటోకాల్స్‌ ప్రకారం జట్లు అన్నీ బయో బబుల్‌లోనే ఉంటాయి. బయటి నుంచి వచ్చేవారు మాత్రమే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే తమ హోటళ్లలో ఉంటున్నవారు మ్యాచ్‌ల కోసం ప్రయాణాల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని' వారు చెప్పారు. logo