సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 06, 2020 , 02:46:46

ఐపీఎల్‌ షెడ్యూల్‌ నేడు విడుదల: బ్రిజేశ్‌ పటేల్‌

ఐపీఎల్‌ షెడ్యూల్‌  నేడు విడుదల: బ్రిజేశ్‌ పటేల్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ షెడ్యూల్‌పై ఉత్కం ఠ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఓవైపు టోర్నీ సమీపిస్తున్నా..షెడ్యూల్‌ విడుదలపై బోర్డు పెద్దలు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ షెడ్యూల్‌ విడుదల ప్రకటనపై ఇప్పటికే సోషల్‌ మీడియాలో అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. నిర్వాహకుల వైఖరిని తప్పుబడుతూ నవ్వు పుట్టించే మీమ్స్‌తో ఫ్యాన్స్‌ సందేశాలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం లీగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ పేర్కొన్నారు. యూఏఈ వేదికగా ఈనెల 19న మొదలయ్యే 13వ సీజన్‌ 53 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సీజన్‌లో రాత్రి పూట మ్యాచ్‌లు అరగంట ముందు (7.30గం) ప్రారంభం కానున్నాయి. లీగ్‌ మొత్తంలో ఒక రోజు రెండు మ్యాచ్‌లు పది ఉంటాయి. ఇప్పటికే క్వారంటైన్‌ ముగించుకున్న జట్లు సన్నాహకాల్లో బిజీగా మారిపోయాయి. 


logo