శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Sep 07, 2020 , 01:57:21

ముంబై X చెన్నై

ముంబై X చెన్నై

  • గతేడాది ఫైనలిస్టుల మధ్య తొలి మ్యాచ్‌..   
  • ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల

దుబాయ్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో స్తబ్దుగా ఉన్న క్రీడాలోకంలో జోష్‌ నింపడానికి ఐపీఎల్‌ సిద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రన్నరప్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య అబుదాబి వేదికగా ఈ నెల 19న తొలి మ్యాచ్‌తో లీగ్‌కు తెరలేవనుంది. మూడు వేదికలు(అబుదాబి, షార్జా, దుబాయ్‌)గా 46 రోజుల పాటు 56 మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీ చరిత్రలో ఇన్ని రోజులు లీగ్‌ జరుగడం ఇదే తొలిసారి. మొత్తం మ్యాచ్‌ల్లో దుబాయ్‌లో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 జరుగనున్నాయి. అయితే ఫ్లే ఆఫ్‌ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. గత నెల ఆఖరి వారంలోనే షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉన్నా..చెన్నై జట్టులో పాజిటివ్‌ కేసులతో పాటు క్వారంటైన్‌ రూల్స్‌ నిబంధనలు వేరుగా ఉండటం ఆలస్యానికి కారణమైంది. logo