శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 28, 2020 , 22:27:26

శనివారమే ఐపీఎల్‌ షెడ్యూల్‌!

శనివారమే ఐపీఎల్‌ షెడ్యూల్‌!

ఐపీఎల్‌ 2020 షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం విడుదల చేయనున్నట్లు తెలిసింది. యూఏఈ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ సహయాన్‌ బిన్‌ ముబారక్‌తో బీసీసీఐ సమావేశం ముగియగా.. దుబాయ్‌, షార్జా, అబుదాబి నగరాల మధ్య రాకపోకల విషయమై కరోనా నిబంధనల గురించి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. దీనికి ఈసీబీ సానుకూలంగా స్పందించగా.. బీసీసీఐ అధికారులు రేపు(ఆగస్టు 29) షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. 

ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఐపీఎల్‌ కరోనా కరాణంగా వాయిదా పడుతూ వచ్చింది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు యూఏఈలో టోర్నీ జరుగనున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. కానీ ఇప్పటివరకు మ్యాచ్‌ల షెడ్యూల్‌ మాత్రం విడుదల చేయలేదు. అబుదాబిలో కరోనా కేసుల ఉధృతి కారణంగా అక్కడ కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అబుదాబికి వెళ్లాలంటే రెండు రోజుల ముందు కరోనా పరీక్షలు చేయించుకొని నెగిటివ్‌ వస్తేనే ఎంట్రీ ఉంటుంది. ఇలాంటి ఆంక్షల మధ్య ఆటగాళ్ల ప్రయణం కష్టమేనని భావించిన బీసీసీఐ యూఏఈ క్రికెట్‌ బోర్డుతో జరిగిన సమావేశంలో నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని కోరగా.. ఈసీబీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదలకు మార్గం సుగమమైందని క్రికెట్‌ అభిమానులు సంబుర పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo