మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 21, 2020 , 12:39:34

ఐపీఎల్‌ 2020 కొత్త లోగో ఇదే..!

ఐపీఎల్‌ 2020 కొత్త లోగో ఇదే..!

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020    టైటిల్‌ స్పాన్సర్‌గా ఫాంటసీ గేమింగ్‌ ఫ్లాట్‌ఫాం ‘డ్రీమ్‌ 11’తో  బీసీసీఐ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ ఏడాది ఐపీఎల్‌-13వ సీజన్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం డ్రీమ్‌ 11  రూ.222కోట్లకు బిడ్‌ వేసి   హక్కులను దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో గత టైటిల్‌ స్పాన్సర్‌ వివో స్థానంలో  డ్రీమ్‌ 11 సింబల్‌ను ఐపీఎల్‌-2020  లోగోలో  చేర్చారు. కొత్త లోగోను ముంబై ఇండియన్స్‌ జట్టు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

ఈ ఏడాది ఐపీఎల్‌  యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు జరుగనుంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లు గురువారమే యూఏఈ చేరుకోగా.. ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు శుక్రవారం బయల్దేరనున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు ఈ వారాంతంలో పయనం కానున్నాయి. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలోని మూడు (దుబాయ్‌, అబుదాబి, షార్జా) వేదికల్లో ఐపీఎల్‌ జరుగనుంది.logo