శనివారం 11 జూలై 2020
Sports - Apr 15, 2020 , 00:12:26

ఐపీఎల్‌ నిరవధిక వాయిదా

ఐపీఎల్‌ నిరవధిక వాయిదా

  • ఫ్రాంచైజీలకు సమాచారమిచ్చిన బీసీసీఐ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సమాచారాన్ని ఫ్రాంచైజీలకు బోర్డు చెప్పేసింది. ఈ విషయాన్ని ఓ ఫ్రాంచైజీ అధికారి మంగళవారం వెల్లడించారు. ‘ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ మాకు సమాచారమిచ్చింది. పరిస్థితులు చక్కబడ్డాక.. ఈ ఏడాదిలో ఆలస్యంగానైనా టోర్నీ జరుగుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది’ అని ఆ అధికారి చెప్పారు. దేశంలో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఉండటం సహా కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ఇప్పట్లో ఐపీఎల్‌ నిర్వహించే అవకాశమే లేదు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది మార్చి 29న ఐపీఎల్‌ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్‌ వల్ల ఈ నెల 15వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. 


logo