బరిలో 292 మంది ఆటగాళ్లు

- నేటి మధ్యాహ్నం 3 గం. నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో..
- బరిలో 292 మంది ఆటగాళ్లు..
- ఫేవరెట్లుగా మ్యాక్స్‌వెల్, మొయిన్
- అజారుద్దీన్ సహా యువ ఆటగాళ్లపై దృష్టి
చెన్నై: ఐపీఎల్ వేలానికి వేళయింది. ఈ ఏడాది 14వ సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలం గురువారం ఇక్కడ జరుగనుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. 8 ఫ్రాంచైజీలు మొత్తం కలిపి 61 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. గతేడాది ఐపీఎల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ వేలంలో ఫేవరెట్లుగా ఉండగా.. ఐసీసీ టీ20 టాప్ ర్యాంకర్ డేవిడ్ మలన్‌కు మంచి ధర వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అదరగొట్టిన భారత దేశవాళీ ప్లేయర్లు అజారుద్దీన్, షారూక్ ఖాన్, సోనూయాదవ్తో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్పైనా అందరి దృష్టి ఉండనుంది. కివీస్ ఆల్‌రౌండర్ కైల్ జెమీసన్, బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్, ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్పైనా ఫ్రాంచైలు అధిక ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఆటగాళ్ల కొనుగోలుకు గరిష్ఠంగా ఒక్కో జట్టుకు రూ.85కోట్లను ఖర్చు పెట్టే అవకాశం ఉండగా.. ఈ ఏడాది వేలానికి పంజాబ్ కింగ్స్ వద్ద అధిక నిధులు ఉండగా హైదరాబాద్ వద్ద తక్కువ ఉన్నాయి. రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్ ఉన్న సీనియర్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్‌కు ఏ మేరకు ధర వస్తుందో చూడాలి. మొత్తంగా ఏ విభాగాల్లో జట్టు బలహీనంగా ఉందో అందుకు సరిపోయే ప్లేయర్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. రూ.2కోట్ల ప్రారంభ ధరకు ఇద్దరు భారత, 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా.. రూ.కోటిన్నరకు 12మంది ఉన్నారు. రూ.కోటి, రూ.75 లక్షలు, రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో మిగిలిన ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో 2020 ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఈ ఏడాది టోర్నీని భారత్‌లోనే బయోబబుల్ మధ్య ఏప్రిల్ - జూన్ మధ్య జరుపుతామని వెల్లడించిన సంగతి తెలిసిందే.
- వేలంలో ఆటగాళ్లు: 292 మంది
- భారత్ నుంచి: 164
- విదేశీ ప్లేయర్లు: 125
- అసోసియేట్ దేశాల నుంచి: ముగ్గురు
- జట్లలో మొత్తంగా ఖాళీ స్థానాలు: 61
- అందులో విదేశీ ఆటగాళ్లకు:22
తాజావార్తలు
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
- నెగెటివ్ షేడ్స్‌లో కనిపిస్తా
- నా కష్టాలు గుర్తొచ్చాయి
- ప్రతి ట్వీట్‌కూ హ్యాకింగ్ లేబుల్ వార్నింగ్.. ఎందుకంటే..!
- జవ్వని సొగసుకు..జడ నగలు!
- ములుగు పిజ్జా.. మహా రుచి!
- గ్రీన్ పకోడి
- మహిళకు ‘పింక్' రక్ష!