ఆదివారం 24 మే 2020
Sports - Mar 26, 2020 , 19:43:33

ఐపీఎల్ జ‌రుగ‌చ్చేమో: రోహిత్‌శ‌ర్మ

ఐపీఎల్ జ‌రుగ‌చ్చేమో:  రోహిత్‌శ‌ర్మ

ముంబై: క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌తిష్టాత్మక ఒలింపిక్స్ స‌హా టోర్నీల‌న్నీ ఓవైపు వాయిదా ప‌డుతుంటే ఐపీఎల్ జ‌రుగ‌వ‌చ్చేమోన‌ని ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ ఆశాభావం వ్య‌క్తం చేశాడు. కొవిడ్‌-19తో ప్ర‌స్తుతం దేశం మొత్తం లాక్‌డౌన్ ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో హిట్‌మ్యాన్ వ్యాఖ్య‌లు ఆస‌క్తి క‌ల్గిస్తున్నాయి. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డ త‌ర్వాత ఏదో ఒక స‌మ‌యంలో ఐపీఎల్ జ‌రిగవ‌చ్చ‌ని, ఎవ‌రికి తెలుస‌ని రోహిత్ అన్నాడు. ప్రస్తుతం కుటుంబంతో క‌లిసి ఇంట్లో గ‌డుపుతున్న ఈ ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్..ఇన్‌స్టాగ్రామ్‌లో కెవిన్ పీట‌ర్స‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు ఇలా స‌మాధాన‌మిచ్చాడు. ఇదిలా ఉంటే కరోనా వైర‌స్‌తో కేంద్ర ఆరోగ్య శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా వచ్చే నెల 15వ తేదీ వ‌ర‌కు ఐపీఎల్‌ను బీసీసీఐ వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ కేంద్రం ఆదేశాల‌కు అనుగుణంగా న‌డుచుకుంటామ‌ని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. 


logo