ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 19:26:09

ఐదు వారాల్లో ఐపీఎల్: మైఖేల్ వాన్

ఐదు వారాల్లో ఐపీఎల్: మైఖేల్ వాన్

ఐదు వారాల్లో ఐపీఎల్: మైఖేల్ వాన్

లండ‌న్‌: ప‌్ర‌మాదక‌ర క‌రోనా వైర‌స్ అంత‌కంత‌కు వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఐపీఎల్ అస‌లు జ‌రుగుతుందా లేదా అన్న దానిపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉన్న‌ది. కొవిడ్‌-19తో దేశాల‌న్ని అతలాకుత‌ల‌మ‌వుతున్న వేళ లీగ్ జ‌రుగ‌డంపై సందిగ్థత ఏర్ప‌డింది. లీగ్ నిర్వ‌హ‌ణ సాధ్య‌సాధ్యాల‌పై ఒక్కొక్క‌రు త‌మ‌త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. భార‌త ఆట‌గాళ్ల‌తో మినీ ఐపీఎల్ నిర్వ‌హించాల‌ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫ్రాంచైజీ భావిస్తుంటే..ఐదు వారాల్లో లీగ్ నిర్వ‌హిస్తే బాగుంటుంద‌ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నాడు. ఐపీఎల్‌ను కుదించి సెప్టెంబ‌ర్‌లో ఐదు వారాలు పెడితే..టీ20 ప్ర‌పంచ క‌ప్ టోర్నీకి స‌న్నాహంగా ఉంటుంద‌ని వాన్ చెప్పుకొచ్చాడు. ఈ విష‌యాన్నిట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు. ‘ఆస్ట్రేలియాలో జ‌రిగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ న‌కు ముందు ఐపీఎల్ జ‌రిగితే బాగుంటుంద‌న్న‌ది నా ఆలోచ‌న‌.  మెగాటోర్నీకి ఐపీఎల్ మంచి సన్నాహ‌కంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఐపీఎల్ వెంట‌నే వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌రుగ‌డం ద్వారా ఆట‌గాళ్లు కూడా మంచి ఫామ్‌లో ఉంటారు’ అని వాన్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే క‌రోనా వైర‌స్‌తో దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ నిర్వ‌హ‌ణపై బీసీసీఐ ఒక అంచ‌నాకు రాలేక‌పోతున్న‌ది. కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల‌కు అనుగుణంగా లీగ్ పై త‌దుప‌రి నిర్ణ‌య‌ముంటుంద‌ని బోర్డు వ‌ర్గాలు పేర్కొన్నాయి. 


logo