మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 10, 2020 , 01:25:49

కరోనాపై గెలిచిన ఐపీఎల్‌

కరోనాపై గెలిచిన ఐపీఎల్‌

న్యూఢిల్లీ: భారతీయులకు క్రికెట్‌ అంటే ఎంత ప్రేమో మరోసారి రుజువైంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ కంటే ఐపీఎల్‌ కోసమే మనవాళ్లు ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికారట. ఈ విషయాన్ని గూగుల్‌ ఇండియా బుధవారం ప్రకటించింది. 2020 గూగుల్‌ ట్రెండ్స్‌లో ఐపీఎల్‌ టాప్‌లో  ఉంటే.. ఆ తర్వాతి స్థానాల్లో కరోనా వైరస్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి ఉన్నాయని తెలిపింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ భారత్‌లో అగ్రస్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.