శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 25, 2020 , 11:52:16

బోల్ట్‌కు పాజిటివ్‌..క్రిస్‌గేల్‌కు నెగెటివ్‌

బోల్ట్‌కు పాజిటివ్‌..క్రిస్‌గేల్‌కు నెగెటివ్‌

న్యూఢిల్లీ: వరల్డ్‌ రికార్డు   స్ర్పింట్‌ దిగ్గజం, ఎనిమిదిసార్లు ఒలింపిక్‌ స్వర్ణ  పతక విజేత ఉసేన్‌ బోల్ట్‌ కరోనా బారినపడ్డారు.   ఇటీవల  తన 34వ జన్మదినం సందర్భంగా బోల్ట్‌  పలువురు ప్రముఖులకు   భారీ   విందు ఏర్పాటు చేశాడు.  ఈ పార్టీకి  వెస్టిండీస్‌   బ్యాటింగ్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌   తదితరులు హాజరయ్యారు. బోల్ట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో జమైకా క్రికెటర్‌ గేల్‌ అలర్ట్‌ అయ్యాడు. ఒకవేళ గేల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఆడుతున్న విధ్వంసకర ఓపెనర్‌ లీగ్‌కు దూరమయ్యే  అవకాశం ఉన్నది. 

తాను కరోనా పరీక్ష చేయించుకోగా తనకు కోవిడ్‌-19 నెగెటివ్‌గా వచ్చినట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.  కొన్ని రోజుల క్రితం ఫస్ట్‌ కోవిడ్‌-19 టెస్టు చేయించుకున్నా. ప్రయాణానికి(యూఏఈ) ముందు   రెండుసార్లు పరీక్షలు చేయించుకుంటే ఫలితం నెగెటివ్‌గా రావాల్సి ఉంటుందని  గేల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. logo