బుధవారం 03 మార్చి 2021
Sports - Jan 23, 2021 , 19:13:30

చెన్నైలోనే ఐపీఎల్‌ -2021 వేలం!

చెన్నైలోనే ఐపీఎల్‌ -2021 వేలం!

ముంబై:  ఐపీఎల్‌-2021 సీజన్‌ కోసం ఫిబ్రవరి 18 లేదా 19న ఆటగాళ్ల మినీ వేలం జరిగే అవకాశం ఉంది.  చెన్నై వేదికగా జరిగే వేలం ఆ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు ఉంటుందని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని    బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.  ' చెన్నై ఆతిథ్యమివ్వనున్న  భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 17న ముగుస్తుంది. కాబట్టి, 18 లేదా 19న వేలం నిర్వహించాలనుకుంటున్నాం. వేదిక మాత్రం చెన్నై.' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.   

జనవరి  20తోనే ఐపీఎల్‌ ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోగా  ఆయా  ఫ్రాంఛైజీలు  పలువురు ఆటగాళ్లను కూడా  వదులుకున్నాయి. జట్ల మధ్య ప్లేయర్ల  ట్రేడింగ్‌ విండో ఫిబ్రవరి 4న ముగియనుంది.

VIDEOS

logo