బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 18, 2021 , 22:01:50

ఐపీఎల్ 2021 వేలం: అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ల‌కు బిగ్ స‌ర్‌ప్రైజ్‌

ఐపీఎల్ 2021 వేలం: అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ల‌కు బిగ్ స‌ర్‌ప్రైజ్‌

న్యూఢిల్లీ: ‌కోట్లాది మంది క్రికెట్ అభిమానుల‌కు దాదాపు రెండు నెల‌లు క‌నువిందు చేసే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)-2021 సంరంభానికి గురువారం తెర లేచింది. త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో జ‌రిగిన ఆట‌గాళ్ల వేలంలో ప‌లు అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ల‌కు వివిధ ఫ్రాంచైసీలు బిగ్ స‌ర్‌ప్రైజ్‌లిచ్చి మ‌రీ.. అంటే భారీ మొత్తంలో ధ‌ర‌కు కొనుగోలు చేశాయి. 

క‌ర్ణాట‌క‌కు చెందిన లోయ‌ర్ ఆర్డ‌ర్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మ‌న్ క్రిష్ట‌ప్ప గౌతం అత్య‌ధిక ధ‌ర ప‌లికాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆయ‌న‌ను రూ.9.25 కోట్ల‌కు ఎగ‌రేసుకుపోయింది. మ‌రో అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ షారూఖ్‌ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.5.25 కోట్ల‌కు, ఆస్ట్రేలియాకు చెందిన రిలై మెరిడిత్‌ను రూ.8 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న‌ది. చేత‌న్ స‌కారియాను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ.1.2 కోట్ల‌కు త‌మ జ‌ట్టులో చేర్చుకున్న‌ది. 

ఇక ఆల్ రౌండ‌ర్ ఖాతాలో చిరిస్ మొర్రిస్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ.16.25 కోట్ల‌కు వేలంలో పాడుకున్న‌ది. క్యైల్ జామిస్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు రూ.15 కోట్ల‌కు గెలుచుకున్న‌ది... మిగ‌తా ఆట‌గాళ్ల వేలం వివ‌రాలు ఒక‌సారి ప‌రిశీలిద్దాం.. 

ఆట‌గాడు ------------------ టైప్ ------------------- ధ‌ర (రూపాయ‌ల్లో) -------  టీం

చిరిస్ మొర్రిస్ ------------- ఆల్ రౌండ‌ర్ -------------- 16.25 కోట్లు --- రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌

క్యైల్ జామిస్‌ ------------ ఆల్‌రౌండ‌ర్ -------------- 15 కోట్లు ---  రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్‌

గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ ------------ ఆల్‌రౌండ‌ర్ -------------- 14.25 కోట్లు ---  రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు

క్రిష్ణ‌ప్ప గౌతం‌ ------------ ఆల్‌రౌండ‌ర్ -------------- 9.25 కోట్లు ---  చెన్నై సూప‌ర్ కింగ్స్‌

మొయిన్ అలీ ------------ ఆల్‌రౌండ‌ర్ -------------- 7 కోట్లు ---  చెన్నై సూప‌ర్ కింగ్స్‌

షారూఖ్ ఖాన్ ------------ ఆల్‌రౌండ‌ర్ -------------- 5.25 కోట్లు ---  పంజాబ్ కింగ్స్‌‌

టామ్ కుర్రాన్  ----------- ఆల్‌రౌండ‌ర్ ------------- 5.25 కోట్లు ---  ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

శివ‌మ్ దూబె -------------- ఆల్ రౌండ‌ర్ -------------- 4.4 కోట్లు  --- రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌

మోయిస్ హెన్రిక్యూస్ ------ ఆల్‌రౌండ‌ర్ ----------- 4.2 కోట్లు ---  పంజాబ్ కింగ్స్‌

షాకిబ్ అల్ హ‌స‌న్‌ ------------ ఆల్‌రౌండ‌ర్ -------------- 3.2 కోట్లు ---  కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌

దావిడ్ మ‌లాన్‌ ------------ ఆల్‌రౌండ‌ర్ -------------- 1.5 కోట్లు ---  పంజాబ్ కింగ్స్‌‌

రిపాల్ ప‌టేల్  ------------ ఆల్‌రౌండ‌ర్ -------------- 20 ల‌క్ష‌లు ---  ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

అర్జున్ టెండూల్క‌ర్ --- ఆల్ రౌండ‌ర్ ----- 20 ల‌క్ష‌లు ---- ముంబై ఇండియ‌న్స్‌


వికెట్ కీప‌ర్లు వీరే

షెల్డోన్ జాక్స‌న్ -------- వికెట్ కీప‌ర్ --------------  20 ల‌క్ష‌లు ----- కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌

మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ -- వికెట్ కీప‌ర్ ----------- 20 ల‌క్ష‌లు ------ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్‌

విష్ణు వినోద్ ------------ వికెట్ కీప‌ర్ ------------- 20 ల‌క్ష‌లు ---- ఢిల్లీ క్యాపిట‌ల్స్‌


బౌల‌ర్లు ఇలా

ఝే రిచ‌ర్డ్‌స‌న్‌‌ -- బౌల‌ర్ ---- 14  కోట్లు --- పంజాబ్ కింగ్స్‌

రిలే మెరిడిత్‌ -- బౌల‌ర్ ---- 8  కోట్లు --- పంజాబ్ కింగ్స్‌

నాథ‌న్ కౌల్ట‌ర్‌-నీలే -- బౌల‌ర్ --- 5 కోట్లు--- ముంబై ఇండియ‌న్స్‌

ఆడం మిల్నే -- బౌల‌ర్ --- 3.2 కోట్లు--- ముంబై ఇండియ‌న్స్

పీయూష్ చావ్లా -- బౌల‌ర్ --- 2.4 కోట్లు--- ముంబై ఇండియ‌న్స్

ఉమేశ్ యాద‌వ్ -- బౌల‌ర్‌-- కోటి --- ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

ముస్తాఫిజుర్ రెహ్మాన్ -- బౌల‌ర్ -- కోటి -- రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌‌

చేత‌న్ స‌కారియా‌ -- బౌల‌ర్ ---- 1.2 కోట్లు ---  రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌

జే సుచిత్  -- బౌల‌ర్ ---- 30 ల‌క్ష‌లు --- స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌

కేసీ క‌రియ‌ప్ప‌ -- బౌల‌ర్ ---- 20 ల‌క్ష‌లు ---  రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌

ఎం సిద్ధార్ధ్ -- బౌల‌ర్ ---- 20 ల‌క్ష‌లు ---  ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

ల‌క్‌మ‌న్ హుస్సేన్ మెరివాలా-- బౌల‌ర్ --- 20 ల‌క్ష‌లు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌


ఇలా బ్యాట్స్‌మ‌న్‌..

ఛ‌తేశ్వ‌ర్ పూజారా--- బ్యాట్స్‌మ‌న్ --- 50 ల‌క్ష‌లు --- చెన్నై సూప‌ర్ కింగ్స్‌

స్టీవెన్ స్మిత్ --- బ్యాట్స్‌మ‌న్ --- 2  కోట్లు --- ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

ర‌జ‌త్ పాటిదార్‌ --- బ్యాట్స్‌మ‌న్ --- 20 ల‌క్ష‌లు --- రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్‌

స‌చిన్ బేబీ‌ --- బ్యాట్స్‌మ‌న్ --- 20 ల‌క్ష‌లు --- రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్‌

సీ హ‌రి నిశాంత్‌--- బ్యాట్స్‌మ‌న్ --- 20 ల‌క్ష‌లు.. చెన్నై సూప‌ర్ కింగ్స్ 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo