శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 22, 2021 , 16:41:55

ఐపీఎల్‌-2021 వేలం వాయిదా!

ఐపీఎల్‌-2021 వేలం వాయిదా!

ముంబై: ఐపీఎల్‌-2021 సీజన్‌ కోసం వచ్చే నెలలో మినీ ఐపీఎల్‌ వేలాన్ని నిర్వహించనున్నారు. ఆటగాళ్ల వేలం ప్రక్రియ నేపథ్యంలో   ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటికే రిటైన్‌ చేసుకొన్న వారితో పాటు వదిలించుకొన్న ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి.  ఐపీఎల్‌-14వ సీజన్‌ కోసం వేలం  ఫిబ్రవరి 11న జరుగుతుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు వేలం నిర్వహణ ఒక వారం పాటు వాయిదా పడిందని తెలిసింది. ఐపీఎల్‌ పాలకమండలి కొద్దిరోజుల్లో తాజా వేలం తేదీని ప్రకటించనుంది.  ఐపీఎల్‌ వేలానికి వేదికను బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు. 

'ఐపీఎల్‌ వేలం  ఫిబ్రవరి మూడో వారంలో జరుగుతుంది. తుది తేదీతో పాటు  వేదికను మరికొన్ని  రోజుల్లో   ప్రకటిస్తామని' బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కోసం రూ.196కోట్లను ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది. 

VIDEOS

logo