శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 22, 2021 , 20:19:33

ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం!

ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం!

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 సీజన్‌కు ముందే ఆటగాళ్ల వేలం   నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమైంది. రాబోయే సీజన్‌కు సంబంధించిన ప్లేయర్స్‌ వేలం  ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని  బీసీసీఐ అధికారి  శుక్రవారం  పీటీఐకి తెలిపారు.  'ఫిబ్రవరి 18న వేలం జరగనుంది. వేదికపై   నిర్ణయం తీసుకోవాల్సి ఉంది' అని అధికారి చెప్పారు.   ఈ ఏడాది ఐపీఎల్‌ భారత్‌లో  జరుగుతుందా లేదా అనే విషయంపై   బీసీసీఐ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.  

రాబోయే సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని  బీసీసీఐ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ కూడా చాలాసార్లు చెప్పారు.  సొంతగడ్డపై  వచ్చే  నెల నుంచి  ఇంగ్లాండ్‌తో భారత్‌  సిరీస్‌  సజావుగా  జరిగితే  స్వదేశంలోనే  ఐపీఎల్‌ నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది. 

VIDEOS

logo