గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 21, 2020 , 15:15:49

ఐపీఎల్‌ 2020.. ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్‌ ఉంటాడా?

ఐపీఎల్‌ 2020.. ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్‌ ఉంటాడా?

కోహ్లీ ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఏడు ఎడిషన్లలో కేవలం రెండు సార్లు మాత్రమే జట్టు ప్లే ఆఫ్‌కు వెళ్లింది. వాటిలో 2016లో ఫైనల్‌కు వెళ్లగా మిగిలిన సీజన్లలో నిరాశ పరిచింది. 2013లో కోహ్లీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆర్‌సీబీ పెద్ద విజయవంతమైన జట్టేమి కాదు. కానీ అప్పుడు ఐదు సీజన్లలో రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. సహజంగానే కోహ్లీ ఆధ్వర్యంలో ఆర్‌సీబీ స్థిరమైన పనితీరులో ఉండడం లేదని ఎల్లప్పుడూ ఐపీఎల్‌ సీజన్‌లో నడిచే చర్చ. అయితే ఆర్‌సీబీ ఫ్రాంజైజీ యజమానులు మాత్రం విరాట్‌ వెనుక బలంగా నిలబడ్డారు. 

కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించడంపై ఫ్రాంచైజీ ఏమైనా ఆలోచనలు చేస్తుందా.. అనే ప్రశ్నకు ఆర్‌సీబీ జట్టు చైర్మన్ సంజీవ్ చురివాలా అద్భుతమైన సమాధానం ఇచ్చారు. విరాట్‌ మొత్తం 110 మ్యాచుల్లో జట్టుకు నాయతక్వం వహించాడు. అందులో ఆర్సీబీ 49 గెలువగా.. 55 ఓడిపోయింది. ఇదే విషయమై సంజీవ్‌ మాట్లాడుతూ ‘కొన్నిసార్లు మీరు ఓడిపోతారు. కొన్నిసార్లు గెలుస్తారు. కానీ ఆ వ్యక్తి ఏమిటో, అతడి ట్రాక్ రికార్డు ఏమిటో మర్చిపోకూడదు’ అని చెప్పారు. ఆర్‌సీబీ యజమానిగా విరాట్‌ మాతో మంచి సంబంధాన్ని కలిగి ఉండడం చాలా గర్వంగా ఉందని సంజీవ్‌ తెలిపారు. logo