శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 15, 2020 , 18:05:30

ఐపీఎల్‌ 2020.. బెన్‌ స్టోక్స్‌ అందుబాటులో ఉంటాడా? రాజస్థాన్ రాయల్స్ వివరణ

ఐపీఎల్‌ 2020.. బెన్‌ స్టోక్స్‌ అందుబాటులో ఉంటాడా? రాజస్థాన్ రాయల్స్ వివరణ

ఐపీఎల్ 2020 మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానుండగా.. రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియడం లేదు. ఇదే విషయమై ఆర్‌ ఆర్‌ ప్రధాన కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ మెక్డొనాల్డ్ మాట్లాడుతూ ఈ ఏడాది ఐపీఎల్‌కు బెన్ స్టోక్స్ అందుబాటులో ఉంటాడా? అనే విషయంపై ఫ్రాంచైజీకి ఇంకా ఎలాంటి సమాచారం లేదన్నారు. 29 ఏండ్ల స్టోక్స్‌ వ్యక్తిగత కారణాల వల్ల పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్నరెండు, మూడో టెస్టులకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ కూడా ఆడలేదు. ఇప్పుడు ఐపీఎల్‌కు కూడా అందుబాటులో ఉంటాడా అనేది ప్రశ్నగా మారింది.  

అయితే మెక్డొనాల్డ్ మాత్రం తమ ఆటగాడికి తగినంత సమయం ఇస్తామంటున్నాడు. ‘మొదట అతడి వ్యక్తిగత పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదు. అతడికి అవసరమైనంత ఎక్కువ సమయం ఇస్తున్నాం. సాధ్యమైనంత వరకు టచ్‌లో ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.’ అని మెక్డొనాల్డ్ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో అన్నాడు. 

ఐపీఎల్‌ 2020 సెప్టెంబర్ 19 నుంచి నవంబర్‌10 వరకు యూఏఈలో జరుగనుండగా.. సెప్టెంబర్ 22న జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo