మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 25, 2020 , 00:45:13

ఖాళీ స్టాండ్లున్నా..హోరాహోరీకి ఢోకా ఉండదు: లక్ష్మణ్‌

ఖాళీ స్టాండ్లున్నా..హోరాహోరీకి ఢోకా ఉండదు: లక్ష్మణ్‌

దుబాయ్‌: కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రేక్షకులు లేకుండా జరిగినా ఆటలో నాణ్యత ఏ మాత్రం తగ్గదని భారత దిగ్గజం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. జట్ల మధ్య హోరాహోరీ పోరును అభిమానులు టీవీల్లో ఎంతో ఆస్వాదిస్తారని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నాడు. లక్ష్మణ్‌ అభిప్రాయాలతో కూడిన వీడియోను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియాలో సోమవారం పోస్ట్‌ చేసింది. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ వచ్చే నెల 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు యూఏఈ వేదికగా జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై లక్ష్మణ్‌ మాట్లాడాడు. ‘మైదానంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు జరిగినా పోటీలను అభిమానులు అమితంగా ఆస్వాదిస్తారని నేను కచ్చితంగా చెప్పగలను. ఆటలో శక్తి, నాణ్యత తగ్గుతుందని అసలు ఆలోచించవద్దు’ అని లక్ష్మణ్‌ చెప్పాడు. సీనియర్లు, జూనియర్లతో సన్‌రైజర్స్‌  మంచి సమతూకంతో ఉందని అన్నాడు.  


logo