మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 07, 2020 , 03:18:02

వివో వీడ్కోలు

వివో వీడ్కోలు

న్యూఢిల్లీ: అంతా ఊహించినట్లే జరిగింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌కు వివో దూరమైంది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా కంపెనీలను భారత్‌లో బాయ్‌కాట్‌ చేయాలనే వాదనలు ఎక్కువైన నేపథ్యంలో వివో మొబైల్‌ కంపెనీ స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని గురువారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ సీజన్‌ కోసం కొత్త స్పాన్సర్‌ను వెతికే పనిలో పడింది. ‘ఐపీఎల్‌-2020తో భాగస్వామ్యం రద్దు చేసుకునేందుకు బీసీసీఐ, వివో మొబైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్ణయించాయి’అని బీసీసీఐ ఏక వాక్య ప్రకటన విడుదల చేసింది. వివో కూడా అచ్చం ఇలాగే ఒకే వాక్యంలో తమ వివరణ ఇచ్చింది. ఐదేండ్ల పాటు టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు గానూ బీసీసీఐతో రూ. 2190 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న వివో.. ఈ ఒక్క ఏడాదికే తప్పుకుందా లేక పూర్తిగా తన ఒప్పందాన్ని రద్దు చేసుకుందా అనే విషయంలో స్పష్టత రావాల్సిఉంది.


logo