శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 14, 2020 , 17:23:05

చెన్నైకి బ‌య‌లుదేరిన రైనా

చెన్నైకి బ‌య‌లుదేరిన రైనా

 న్యూఢిల్లీ:  చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాళ్లు సురేశ్ రైనా, దీప‌క్ చాహ‌ర్‌, పియూష్ చావ్లా, బ‌రింద‌ర్ శ్రాణ్ , చెన్నైకి బ‌య‌లుదేరారు. వ‌చ్చే నెల 19 నుంచి యూఏఈ వేదిక‌గా జ‌రుగనున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ కోసం చెన్నై ఫ్రాంచైజీ ముంద‌స్తుగా శిక్ష‌ణ శిబిరం నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. ఆగ‌స్టు 15 నుంచి 20 వ‌ర‌కు చెపాక్ స్టేడియంలో ధోనీ సేన ప్రాక్టీస్ చేయ‌నుంది. 

ఇందుకోసం ఈ న‌లుగురు ఆట‌గాళ్లు విమానంలో చెన్నైకి బ‌య‌లుదేరారు. ఆట‌గాళ్ల‌తో కలిసి దిగిన ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన రైనా `చెన్నైకి బ‌య‌లుదేరాం. ధ‌న్య‌వాదాలు విస్తారా.. మ‌మ్మ‌ల్ని చెన్నై తీసుకెళ్తున్నందుకు`అని పోస్ట్ చేశాడు.  ఈ శిబిరం కోస‌మే తాజాగా మ‌హేంద్ర‌సింగ్ ధోనీ క‌రోనా వైర‌స్ ప‌రీక్ష చేయించుకోగా.. అందులో నెగిటివ్ అని తేలింది. రేప‌టి నుంచి ఆరు రోజుల పాటు దేశీయ ఆట‌గాళ్ల కోసం ప్ర‌త్యేక క్యాంప్ నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న ధోనీదేనని ఫ్రాంచైజీ యాజ‌మాన్యం చెప్పింది. 


logo