సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 16, 2020 , 14:46:46

IPL2020:సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే..

IPL2020:సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే..

టోర్నీలో చివరి లీగ్‌ మ్యాచ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ మధ్య మే 17న జరుగనున్నది.

న్యూఢిల్లీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ షెడ్యూల్‌ ఖరారైంది.  ముంబై వేదికగా మార్చి 29న 2020 సీజన్‌ ఆరంభంకానుంది. మే 24న ఫైనల్‌ జరగనుంది వాంఖడే స్టేడియంలో జరిగే సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. రాబోయే సీజన్‌లో ఏ ఒక్క శనివారం కూడా రెండు మ్యాచ్‌లు నిర్వహించట్లేదు.  ఇకపై కేవలం ఆదివారాల్లో మాత్రమే రెండు(4PM, 8PM)  మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.  లీగ్‌ దశ ఏకంగా ఆరువారాల పాటు కొనసాగనుంది. టోర్నీలో చివరి లీగ్‌ మ్యాచ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ మధ్య మే 17న జరుగనున్నది.  

అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ సొంత మైదానాల్లోనే మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఒక్క రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రమే జైపూర్‌ తర్వాత గువహటిని తమ రెండో హోం గ్రౌండ్‌గా ఎంపిక చేసుకుంది.  మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ  ఫ్రాంచైజీలకు అందించింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో పాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్‌) జట్లు మ్యాచ్‌లు జరగనున్న తేదీల వివరాలను ట్విటర్లో పోస్ట్‌ చేసింది. 

మ్యాచ్‌ల షెడ్యూల్

ఉప్పల్ స్టేడియంలో జరిగే తేదీలు: ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 

ఇతర వేదికల్లో: ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15  logo