గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 27, 2020 , 00:31:27

స్టోక్స్‌ సెంచరీ

స్టోక్స్‌ సెంచరీ

  • ముంబైపై రాజస్థాన్‌ గెలుపు
  • బెంగళూరును ఓడించిన చెన్నై

అబుదాబి: ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దూరమైన సమయంలో రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నైసూపర్‌ కింగ్స్‌ చక్కటి విజయాలు సాధించాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో బెంగళూరుపై చెన్నై.. ముంబైపై రాజస్థాన్‌ గెలుపొందాయి. తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లీ (50) అర్ధశతకం సాధించాడు. అనంతరం రుతురాజ్‌ గైక్వాడ్‌ (65 నాటౌట్‌) అజేయ హాఫ్‌సెంచరీతో చెలరేగడంతో చెన్నై 18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 150 పరుగులు చేసి నెగ్గింది. ఇక రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా (60 నాటౌట్‌), దంచికొట్టడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో బెన్‌ స్టోక్స్‌ (60 బంతుల్లో 107 నాటౌట్‌; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో అలరించడంతో రాజస్థాన్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలుపొందింది.