బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 27, 2020 , 00:31:49

పాండ్యా పిడికిలి పైకెత్తి..

 పాండ్యా పిడికిలి పైకెత్తి..

అబుదాబి: ఐపీఎల్‌లో బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ (బీఎల్‌ఎమ్‌) తొలిసారి భాగమైంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. బీఎల్‌ఎమ్‌కు మద్దతుగా నిలిచాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్‌.. మోకాళ్లపై కూర్చోని కుడిచేతి పిడికిలి పైకెత్తి వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి సంఘీభావం ప్రకటించాడు. డగౌట్‌లో కూర్చున్న తాత్కాలిక కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ కూడా హార్దిక్‌ను అనుసరిస్తూ చేయి పైకెత్తాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత తాను బీఎల్‌ఎమ్‌కు మద్దతుగా నిలిచిన ఫొటోను హార్దిక్‌ ట్వీట్‌ చేశాడు. అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌.. ఐపీఎల్‌లో బీఎల్‌ఎమ్‌ భాగం కాకపోవడం బాధగా ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ని పోలీసులు దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో బీఎల్‌ఎమ్‌కు వెస్టిండీస్‌ జట్టు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తూ వస్తున్నది.