శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 05, 2020 , 00:13:52

సూపర్‌ కింగ్స్‌ వల్లే

సూపర్‌ కింగ్స్‌ వల్లే

చెన్నై: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)తో తన అనుబంధాన్ని ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ మరోసారి వెల్లడించాడు. అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదిగేందుకు సీఎస్‌కే ఎంతో ఉపకరించిందని అన్నాడు. ఆటలో, ఆట బయట కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు సహాయం చేసిందని గుర్తు చేసుకున్నాడు.  బుధవారం ఓ టీవీ షోలో ధోనీ మాట్లాడుతూ.. ‘నేను అన్ని విధాల మెరుగుపడేందుకు చెన్నై జట్టు సహకరించింది. అత్యుత్తమ స్థితిలో ఉన్నప్పుడు అణుకువగా ఎలా ఉండాలో నేర్పింది. సీఎస్‌కే అభిమానులు నాపై ఎంతో ప్రేమ, గౌరవాన్ని చూపుతున్నారు. ‘తలా’(అన్న) అని పిలువడంలోనే అది ప్రస్ఫుటిస్తున్నది’ అని అన్నాడు.


logo