బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 03:23:19

హైదరాబాద్‌ X కోల్‌కతా

హైదరాబాద్‌ X కోల్‌కతా

అబుదాబి: మిడిలార్డర్‌ వైఫల్యంతో బెంగళూరు చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. శనివారం కోల్‌కతాపై నెగ్గి లీగ్‌లో బోణీ చేయాలని భావిస్తున్నది. తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌటైన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. గాయం కారణంగా లీగ్‌కు దూరమైన ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్‌ స్థానంలో జాసెన్‌ హోల్డర్‌ జట్టులోకి వచ్చినా.. మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, ప్రియం గార్గ్‌ మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్‌లో దొర్లిన తప్పులను సరిదిద్దుకొని రెండో పోరుకు సిద్ధంగా ఉన్నామని వార్నర్‌ అంటుంటే.. మరోవైపు కోల్‌కతా కూడా విజయంపై కన్నేసింది. ముంబై చేతిలో ఓడిన  కార్తీక్‌ సేన ఈ మ్యాచ్‌ నెగ్గి పాయింట్ల పట్టికలో ఖాతా తెరువాలని కృతనిశ్చయంతో ఉంది.



logo