శనివారం 24 అక్టోబర్ 2020
Sports - Sep 25, 2020 , 14:35:51

విరాట్‌ కోహ్లీకి జరిమానా

విరాట్‌ కోహ్లీకి జరిమానా

దుబాయ్: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి జరిమానా విధించారు.  ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌కారణంగా రూ.12లక్షల ఫైన్‌ వేశారు.  

ఐపీఎల్‌-2020లో భాగంగా సెప్టెంబర్‌ 24న దుబాయ్‌ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌  నిర్ణీత సమయంలో  ఓవర్లు పూర్తిచేయకపోవడంతో  ఆ టీమ్‌ సారథి విరాట్‌ కోహ్లీకి జరిమానా వేసినట్లు  ఐపీఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

'ఈ సీజన్లో ఆర్‌సీబీకి ఇదే తొలి తప్పిదం. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం కనీస ఓవర్‌ రేట్‌ పాటించనందుకు కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించినట్లు' తెలిపింది. గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 97 పరుగుల తేడాతో ఓడిపోయింది. సెప్టెంబర్‌ 28న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు ఢీకొంటుంది. 


logo