గురువారం 26 నవంబర్ 2020
Sports - Sep 24, 2020 , 01:16:35

15 కోట్లకు.. 15 పరుగులు

15 కోట్లకు.. 15 పరుగులు

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర (రూ. 15.5 కోట్లు) పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన పాట్‌ కమిన్స్‌ సీజన్‌ తొలి మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో రోహిత్‌ రెండు సిక్సర్లు బాదడంతో కమిన్స్‌ 15 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ దెబ్బకు మరో 10 ఓవర్ల వరకు కార్తీక్‌.. కమిన్స్‌కు బంతినివ్వలేదు. 15వ ఓవర్లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన కమిన్స్‌ మరోసారి 15 పరుగులు ఇచ్చుకోగా.. మూడో ఓవర్‌లో ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో 15 కోట్లకు 15 పరుగులు అంటూ సోషల్‌ మీడియాలో అతడిపై జోకులు పేలాయి. అయితే బౌలింగ్‌లో తేలిపోయిన కమిన్స్‌ బ్యాట్‌తో ఫర్వాలేదనిపించాడు. బుమ్రా వేసిన 18 ఓవర్‌లో 4 సిక్సర్లు సహా 27 పరుగులు పిండుకున్నాడు.