సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 16, 2020 , 02:10:39

ఆ రికార్డు నాకే తెలియలేదు: నోర్జే

 ఆ రికార్డు నాకే తెలియలేదు: నోర్జే

దుబాయ్‌: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని వేశానని మ్యాచ్‌ ముగిసే వరకు తనకే తెలియదని ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ పేసర్‌ ఎన్రిచ్‌ నోర్జే చెప్పాడు. ఆ తర్వాత తాను ఈ విషయం గురించి విన్నానని ఆ జట్టు ఓపెనర్‌ ధవన్‌తో గురువారం ఓ వీడియోలో అతడు చెప్పాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి లీగ్‌లో ఫాస్టెస్‌ బాల్‌ రికార్డును నోర్జే  నమోదు చేశాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పేసర్‌, బెంగళూరు స్టార్‌ డేల్‌ స్టెయిన్‌(154.4 కిలోమీటర్లు) వేసిన బంతే రికార్డుగా ఉండేది. కాగా రాజస్థాన్‌తో మ్యాచ్‌లోనే గంటకు 155కిలోమీటర్ల వేగంతో వేసిన బంతితో బట్లర్‌ను ఔట్‌ చేసిన నోర్జే.. ఫాస్టెస్ట్‌ బాల్‌ జాబితాలో రెండో స్థానంలోనూ నిలిచాడు.  వేగం, స్వింగ్‌తో కీలకమైన వికెట్లు తీస్తూ ఈ సీజన్‌లో ఢిల్లీ విజయాల్లో నోర్జే కీలకపాత్ర పోషిస్తున్నాడు.