సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 06, 2020 , 20:13:02

ఐపీఎల్ 2020.. సెప్టెంబ‌ర్ 21న ఆర్‌సీబీతో త‌ల‌ప‌డ‌నున్న హైద‌రాబాద్‌

ఐపీఎల్ 2020.. సెప్టెంబ‌ర్ 21న ఆర్‌సీబీతో త‌ల‌ప‌డ‌నున్న హైద‌రాబాద్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ ఆదివారం రానే వ‌చ్చింది. యూఏఈ వేదిక‌గా  సెప్టెంబ‌ర్ 19నుంచి న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు ఐపీఎల్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు బీసీసీఐ షెడ్యూల్‌లో తెలిపింది. మొత్తం 53 రోజుల్లో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ దశలో ప్రతి జట్టూ మిగిలిన ఏడు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. మొద‌ట ముంబై, చెన్నై జ‌ట్లు బ‌రిలోకి దిగ‌నుండ‌గా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాత్రం సెప్టెంబర్‌ 21న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో త‌ల‌ప‌డ‌నుంది.  

2019 సీజ‌న్‌లో కేన్ విలియ‌మ్స‌న్ హైద‌రాబాద్‌కు కెప్టెన్‌గా ఉండ‌గా.. ఆశించిన స్థాయిలో జ‌ట్టును న‌డిపించ‌లేక‌పోయాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన స‌న్‌రైజ‌ర్స్ కేవ‌లం ఆరు మ్యాచ్‌ల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. ప్లే ఆఫ్‌కు అర్హ‌త సాధించినా ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఇంటి దారి ప‌ట్టింది.  ఇక ఐపీఎల్ 2020 సీజన్‌కు జ‌ట్టు బాధ్య‌త‌ల‌ను తిరిగి డేవిడ్ వార్న‌ర్‌కు అప్ప‌గించ‌డంతో జ‌ట్టు గ‌త వైభ‌వాన్ని సంత‌రించుకోనుంద‌ని అభిమానులు సంబుర ప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌కు ఏరోజు ఏ జ‌ట్టుతో మ్యాచ్ ఉందో తెలుపుతూ ఫ్రాంచైజీ షెడ్యూల్‌ను అధికారిక ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo