బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 12, 2020 , 21:05:42

భువనేశ్వర్‌ దారిలో ఇషాంత్‌శర్మ.. కండరాల నొప్పితో ఐపీఎల్‌కు దూరం

భువనేశ్వర్‌ దారిలో ఇషాంత్‌శర్మ.. కండరాల నొప్పితో ఐపీఎల్‌కు దూరం

దుబాయ్‌ : ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ కండరాల నొప్పి కారణంగా మొత్తం ఐపీఎల్‌ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ  క్యాపిటల్స్‌ యాజమాన్యం ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే తుంటి నొప్పి కారణంగా ఐపీఎల్‌ మ్యాచుల నుంచి హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కూడా తప్పుకోవాల్సి వచ్చింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్‌లో ఇషాంత్‌ శర్మ గాయపడటం చెడు వార్తగానే చెప్పుకోవచ్చు. బయో-సేఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ కింద యూఏఈలో జరుగుతున్న ప్రస్తుత సీజన్‌ మొత్తం ఐపీఎల్ నుంయి తప్పుకున్నాడు. ఐపీఎల్ 13 వ ఎడిషన్‌లో ఇషాంత్‌శర్మ ఒక్క మ్యాచే ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లు విసిరిన ఇషాంత్‌ ఒక్క వికెట్ తీసుకోకుండా 26 పరుగులిచ్చాడు. ఈ నెల 7వ తేదీన నెట్‌ప్రాక్టీస్‌ సమయంలో ఇషాంత్‌ పక్కటెముకకు గాయమైందని, దాంతో కండరాలు చితికిపోయాయని ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ప్రకటనలో వివరించింది. డీసీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మాన్ కూడా గాయపడి వారంపాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ 10 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.