బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 28, 2020 , 00:14:12

సన్‌రైజర్స్‌ సారథిగా వార్నర్‌

 సన్‌రైజర్స్‌ సారథిగా వార్నర్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తిరిగి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఏడాది నిషేధానికి గురవడంతో.. ఐపీఎల్‌ కెప్టెన్సీ కోల్పోయిన వార్నర్‌ 2019 ఎడిషన్‌లో విలియమ్సన్‌ సారథ్యంలో అదరగొట్టాడు. గతేడాది బ్యాట్‌తో పాటు ప్రవర్తనతోనూ మెప్పించిన వార్నర్‌కే.. సన్‌రైజర్స్‌ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్‌ ద్వారా స్పష్టంచేసింది. ‘ఐపీఎల్‌ 2020లో సన్‌రైజర్స్‌కు సారథ్యం వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. రెండేండ్లుగా టీమ్‌ ను నడిపించిన విలియమ్సన్‌కు ధన్యవాదాలు. ఈ అవకాశమిచ్చిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. 13వ సీజన్‌లో ట్రోఫీ నెగ్గేందుకు శాయశక్తులా కృషిచేస్తాం’ అని వార్నర్‌ వీడియోలో చెప్పాడు. 

logo