గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 11, 2020 , 22:15:25

ఆగ‌స్టు 21న దుబాయ్‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్‌

 ఆగ‌స్టు 21న దుబాయ్‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్‌

న్యూఢిల్లీ: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ ఆడేందుకు చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ నెల 21న యూఏఈ బ‌యలుదేర‌నుంది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో ఈ ఏడాది ఐపీఎల్ దుబాయ్‌లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. సెప్టెంబ‌ర్ 19 నుంచి న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు లీగ్ జ‌రుగ‌నుంది. 

ఫ్రాంచైజీల‌న్నీ ఏర్పాట్ల‌లో మునిగిపోయిన వేళ‌.. చెన్నై సూప‌ర్ కింగ్స్ అంద‌రికంటే ముందుగా ఈ నెల 21న దుబాయ్‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించింది. `ఆగ‌స్టు 16 నుంచి చెన్నై జ‌ట్టు చెపాక్‌లో ప్రాక్టీస్ చేయ‌నుంది. ధోనీ, రైనాతో పాటు మొత్తం జ‌ట్టు ఆట‌గాళ్లు ఆగ‌స్టు 21న యూఏఈకి బ‌య‌లుదేరనుంది`అని టీమ్ సీఈవో క‌సి విశ్వ‌నాథ‌న్ తెలిపారు. 


logo