గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 11, 2020 , 15:01:43

ఐపీఎల్‌ 2020 అవార్డు విన్నర్లు వీరే..

ఐపీఎల్‌ 2020 అవార్డు విన్నర్లు వీరే..

దుబాయ్: ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్‌  వరుసగా రెండో టైటిల్‌ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘనవిజయం సాధించింది. సీజన్‌ ఆసాంతం అంచనాలకు మించి అలరించిన ఆటగాళ్లు ఐపీఎల్‌ అవార్డులను దక్కించుకున్నారు. వీరందరికీ నగదు బహుమతి అందజేశారు. 

విజేతల జాబితా..

ఎమర్జింగ్‌ ప్లేయర్‌(రూ.10లక్షలు): దేవ్‌దత్‌ పడిక్కల్‌ (బెంగళూరు)

మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌(రూ.10లక్షలు): జోఫ్రా ఆర్చర్‌ (రాజస్థాన్‌)

సూపర్‌ స్ట్రైకర్‌(రూ.10లక్షలు): పొలార్డ్‌(ముంబై)

మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌‌((రూ.10లక్షలు): ట్రెంట్‌ బౌల్ట్‌ (ముంబై)

పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌(రూ.10లక్షలు): ట్రెంట్‌ బౌల్ట్‌(ముంబై)

పర్పుల్‌ క్యాప్‌ ( రూ.10లక్షలు, అత్యధిక వికెట్లు) : రబాడ (ఢిల్లీ)

ఆరెంజ్‌ క్యాప్‌ (రూ.10లక్షలు, అత్యధిక పరుగులు): కేఎల్‌ రాహుల్‌ (పంజాబ్‌)

ఫెయిర్‌ ప్లే అవార్డు(రూ.10లక్షలు): ముంబై ఇండియన్స్‌

గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ద సీజన్(రూ.10లక్షలు)‌: రాహుల్‌ (పంజాబ్‌)

అత్యధిక సిక్సర్లు(రూ.10లక్షలు): ఇషాన్‌ కిషన్‌(ముంబై)