ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Sep 05, 2020 , 15:21:57

రేపే ఐపీఎల్‌ షెడ్యూల్‌: ఛైర్మన్‌ బ్రిజేశ్‌

రేపే ఐపీఎల్‌ షెడ్యూల్‌: ఛైర్మన్‌ బ్రిజేశ్‌

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ షెడ్యూల్‌ కోసం అటు ఫ్రాంఛైజీలతో పాటు ఇటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీగ్‌ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ప్రకటించినప్పటికీ బోర్డు నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. సమయం గడుస్తున్నా షెడ్యూల్‌ విడుదల చేయకపోవడంపై సోషల్‌ మీడియాలో సెటైర్లు ప్రారంభమయ్యాయి. 

తాజాగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ప్రకటన చేశారు.  యూఏఈలో సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభమయ్యే  ఐపీఎల్‌ 2020 షెడ్యూల్‌ రేపు విడుదల అవుతుందని బ్రిజేశ్‌ వెల్లడించారు.   ఐపీఎల్‌ 2020 టోర్నీ  దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో  సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనుంది. 


logo