బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 03, 2020 , 16:22:29

‌IPL-13: కుర్రాళ్ల‌ను స్వేచ్ఛ‌గా ఆడ‌మ‌న్నా: వార్న‌ర్

‌IPL-13: కుర్రాళ్ల‌ను స్వేచ్ఛ‌గా ఆడ‌మ‌న్నా: వార్న‌ర్

అబుదాబి: కుర్రాళ్ల‌ను స్వేచ్ఛ‌గా ఆడ‌మ‌న్నాన‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ చెప్పారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పూర్తిగా స్వేచ్ఛ‌గా ఆడుకోండ‌ని త‌న జ‌ట్టులోని యువ ఆట‌గాళ్లంద‌రికీ సూచించాన‌ని ఆయ‌న తెలిపారు. అదేవిధంగా శుక్ర‌వారం చెన్నైతో మ్యాచ్‌లో యువ ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను వార్న‌ర్ మెచ్చుకున్నారు. యంగ్‌స్ట‌ర్స్ అభిన‌య్ శ‌ర్మ‌, ప్రియం గార్గ్ అద్భుత ఆట‌తీరు క‌న‌బ‌ర్చార‌ని వార్న‌ర్ ప్ర‌శంసించారు. 

కాగా, ఐపీఎల్ సీజ‌న్-13లో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు తొలి రెండు మ్యాచ్‌ల‌లో ఓట‌మి పాల‌య్యింది. అయితే 3వ‌, 4వ మ్యాచ్‌ల‌తో వ‌రుస విజయాల‌తో ప్ర‌స్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. శుక్ర‌వారం నాటి మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు దోని నేతృత్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు 165 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ల‌క్ష్య చేధ‌న‌లో చెన్నై జ‌ట్టు ఐదు వికెట్లు కోల్పోయి 157 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఏడు ప‌రుగుల స్వ‌ల్ప తేడాతో ఓట‌మిని చ‌విచూసింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.