శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 06, 2020 , 22:25:32

ఐపీఎల్‌ 2020 స్పాన్సర్ల కోసం త్వరలో టెండర్‌ ప్రక్రియ

ఐపీఎల్‌ 2020 స్పాన్సర్ల కోసం త్వరలో టెండర్‌ ప్రక్రియ

న్యూ ఢిల్లీ:  ఐపీఎల్ 2020 స్పాన్సర్ల కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) త్వరలోనే టెండర్ ప్రక్రియ ద్వారా బిడ్లను ఆహ్వానించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 13 వ ఎడిషన్‌కు వీవో టైటిల్ స్పాన్సర్‌గా నిష్క్రమించినట్లు అధికారికంగా ధ్రువీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త స్పాన్సర్‌ను నియమించేటప్పుడు బోర్డు తగిన శ్రద్ధవహిస్తుందని, పారదర్శకతను అనుసరిస్తుందని బీసీసీఐ సభ్యుడు ఒకరు తెలిపారు. 

‘బీసీసీఐ త్వరలో ఐటీబీ (ఇన్విటేషన్‌ టు బిడ్‌)తో ముందుకు వస్తున్నది. బోర్డు పారదర్శకతను పాటించేందుకు టెండర్ ప్రక్రియను అనుసరిస్తోంది.’ అని ఆయన పేర్కొన్నారు. ఐటీబీ కింద విజేత బిడ్డర్‌కు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు లభిస్తాయి. ఐపీఎల్‌ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో జరుగనుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo