సోమవారం 30 మార్చి 2020
Sports - Feb 03, 2020 , 13:11:56

Tokyo 2020: గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా గంగూలీ

Tokyo 2020: గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా గంగూలీ

జపాన్‌లోని టోక్యో వేదికగా ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు విశ్వక్రీడలు జరగనున్నాయి.

ఢిల్లీ:   ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడా బృందానికి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉండాలని టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీని భారత ఒలింపిక్‌ సంఘం(ఐవోఏ) ఆహ్వానించింది.  జపాన్‌లోని టోక్యో వేదికగా ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు విశ్వక్రీడలు జరగనున్నాయి.  ఈ మేరకు దాదాకు  ఐవోఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా లేఖ రాశారు. ‘టోక్యో 2020 గేమ్స్‌లో 14-16 క్రీడాంశాల్లో సుమారు 100-200 అథ్లెట్లు పాల్గొంటారని అంచనావేస్తున్నాం. ఒలింపిక్స్‌ గేమ్స్‌లో పాల్గొనే టీమ్‌లో సీనియర్లతో పాటు అరంగేట్రం చేయబోతున్న యువ క్రీడాకారులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని' మెహతా అన్నారు.   


'కోట్లాది మంది ప్రజలకు, ముఖ్యంగా యువతకు  మీరు స్ఫూర్తిగా నిలిచారు.  ఒక  పాలకుడిగా యువ ఆటగాళ్లలో ప్రతిభను పెంచుతున్నారు.  మీ మద్దతు ఒలింపిక్స్‌లో భారత బృందానికి ప్రేరణగా నిలుస్తుంది. విశ్వక్రీడల్లో భారత బృందానికి మీరు(దాదా) మద్దతుగా ఉంటారని ఆశిస్తున్నామని’  మెహతా పేర్కొన్నారు.   2016 రియో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌, బీజింగ్‌ ఒలింపిక్ గోల్డ్‌ మెడలిస్ట్‌ అభినవ్‌ బింద్రా, బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్లుగా  వ్యవహరించారు. 


logo