మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 21:26:37

అదొక్కటే మారలేదు: ఆనంద్

అదొక్కటే మారలేదు: ఆనంద్

Introduction of computers has changed the approach to chess: Anand 


ముంబై: కంప్యూటర్ల రాకతో చదరంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ అన్నాడు. గత కొన్నేండ్లలో చెస్‌లో అనూహ్య మార్పులు వచ్చాయని వాటిని కొత్త తరం త్వరగా అందిపుచ్చుకోగలిగిందని పేర్కొన్నాడు. శనివారం మైండ్‌ మాస్టర్స్‌షోలో ఆనంద్‌ తన చిన్ననాటి చెస్‌ అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.

‘నాకు ఆరేండ్ల వయసున్నప్పుడు మా అన్న, అక్క చెస్‌ ఆడేవాళ్లు. అప్పుడు నేను అమ్మ వద్దకు వెళ్లి నాకు కూడా నేర్పమని బలవంత పెట్టేవాడిని. ఒక్క రోజులో పెద్ద ప్లేయర్‌ని అయిపోలేదు. దీని వెనుక ఏండ్ల తరబడి చేసిన కృషి ఉంది. 80వ దశకంలో నేను నేర్చుకున్న ఆటకు ఇప్పటి ఆటకు చాలా తేడా ఉంది. కంప్యూటర్ల రాకతో చెస్‌ ముఖచిత్ర మారిపోయింది. బోర్డు ముందు ఇద్దరు ఆటగాళ్లు ఎదురెదురుగా కూర్చొని ఆడటం ఒక్కటే మారలేదు. మిగిలిందంతా మారిపోయింది’ అని ఆనంద్‌ వివరించాడు.  


logo