మ్యూనిచ్: యూరో కప్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. ఓవైపు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు జరుగుతుంటే.. మరోవైపు మరికొన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి పారాచూట్ సహాయంతో నిరసన వ్యక్తం చేసేందుకు చేసిన ప్రయత్నం ప్రమాదకరంగా మారింది. మంగళవారం ఫ్రాన్స్, జర్మనీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా గాల్లోనుంచి నిరసనకారుడు పారాచూట్‌తో దిగాడు. అయితే స్టేడియంలోని కెమెరా వైర్లు తాకి అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్టేడియం పై కప్పు పెచ్చులు కూలడంతో అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే ‘కిక్ ఔట్ ఆయిల్ గ్రీన్‌పీస్’ అని రాసి ఉన్న పారాచూట్‌తో దిగిన నిరసనకారుడు మైదానంలో దిగుతూ ఆయిల్ వాడకాన్ని నిషేధించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు.