మేషం
ప్రారంభించిన పనులు లాభసాటిగా పూర్తవుతాయి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. అధికారులకు తోటివారితో కార్యసాఫల్యత ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. చేసే పనులవల్ల ఆదాయం కలిసివస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో సుహృద్భావ వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో, పిల్లలతో సంతోషంగా ఉంటారు. పనుల విషయమై చురుకుగా ఆలోచిస్తారు. సత్ఫలితాలు పొందుతారు. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అయినా ఆదాయం క్రమేపీ పెరగడంతో సంతృప్తిగా ఉంటారు.
వృషభం
అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సామరస్యంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పూర్వంతో పోల్చితే, అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన వారం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. చేసే పనులలో, వ్యాపారాలలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో ఇబ్బందులు ఉండవచ్చు. పై అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు ఎదురవుతాయి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి చేసే పనులపై మనసు నిలపడం అవసరం. మిగతా విషయాలలో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు.
మిథునం
తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. సమాజంలో మంచిస్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా కొన్ని ఊహించని పనులు అనుకూలిస్తాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని సరైన సమయంలో ఆచరణలో పెడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా శుభకార్యాలు చేస్తారు. చదువులో రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో అధికారులతో స్నేహంగా ఉంటారు. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. సమయానుకూల నిర్ణయాలతో సంతృప్తి లభిస్తుంది. కుటుంబంలో అందరూ సహకరిస్తారు. జీవిత భాగస్వామితో, పిల్లలతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం
ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. సంతోషంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయినా అధికారుల ఆదరణతో లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు. తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ సత్ఫలితాలు పొందుతారు. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు పెరుగుతాయి. మనస్ఫర్ధలు ఏర్పడవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం, ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. కోర్టు పనులలో అనుకూల తీర్పులు ఉంటాయి. ప్రభుత్వ, రాజకీయ పనులలో వృథా ఖర్చులు ముందుకు వస్తాయి.
సింహం
ఇంట్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. అన్ని పనులనూ సంతృప్తిగా పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులను ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉన్నా, పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. కొత్త ఉద్యోగాలలో చేరతారు. వ్యాపారస్తులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో, అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి.
కన్య
సంతృపికరంగా పనులు పూర్తి చేస్తారు. రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. నిత్య వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. వాహనాలవల్ల కలిసివస్తుంది. వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతో పాత వెషమ్యాలు దూరమై, సత్సంబంధాలు వృద్ధి పొందుతాయి. జీవిత భాగస్వామితో, పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలమైన వారం. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. పిల్లల చదువు విషయంలో పట్టుదల చూపుతారు.ఉద్యోగస్తులకు తోటి సిబ్బంది సహకారం లభిస్తుంది.
తుల
వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లలు చదువులలో రాణించి మంచి ఫలితాలు పొందుతారు. ఉన్నత విద్యా ప్రయత్నాలలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల ఆదరణ లభిస్తుంది. తోటి ఉద్యోగుల సహకారంతో నలుగురిలో మంచిపేరు పొందుతారు. స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. ఇంట్లో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. సంగీత, సాహిత్య కళాకారులకు కొంత అనుకూలంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల తోడ్పాటుతో నిర్ణయాలు అమలు పరుస్తారు.
వృశ్చికం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి కావచ్చు. భూములు, స్థిరచరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం క్రమేపీ పెరగడంతో సంతృప్తిగా ఉంటారు. సంఘంలో మంచివారి సాహచర్యం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో, పిల్లలతో సంతోషంగా ఉంటారు. స్నేహితులు, బంధుమిత్రుల సహాయ సహకారాలతో పనులు పూర్తవుతాయి. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంటుంది.
ధనుస్సు
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. పనులలో బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో ముఖ్యమైన పనులలో జాప్యం ఉంటుంది. ప్రయాణాలవల్ల అలసట, వృథా ఖర్చులు ఉంటాయి. స్నేహితులు, బంధువులతో పనులు కలిసివస్తాయి. బంధువుల రాకవల్ల ఖర్చులు పెరుగవచ్చు. వాహనాలవల్ల ఖర్చులు ఉంటాయి. అయినా పనులు నెరవేరుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో పై అధికారులతో స్నేహాన్ని పెంపొందించుకునే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉంటూ, పనులను పూర్తి చేసుకుంటారు. ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు.
మకరం
ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. సమాజంలో మంచివారితో స్నేహం పెంపొందుతుంది. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎదరయ్యే సమస్యలను సంయమనంతో పరిష్కరించుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి అవకాశంతో ఉద్యోగ మార్పు ఉండవచ్చు. వ్యాపారస్తులకు సిబ్బందివల్ల ఖర్చులు పెరిగినా పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి.
కుంభం
సంయమనంతో పనులు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. ఖర్చులను నియంత్రించుకోవడంతో కొన్ని పనులలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. గతంలో అప్పుగా ఇచ్చిన సొమ్ము పాక్షికంగా అందుతుంది. చదువు విషయంలో ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదల కోసం ప్రయత్నిస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. బంధువర్గం, స్నేహితుల సూచనలను పాటించి, సత్ఫలితాలు పొందుతారు. శుభకార్యాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసివస్తుంది. భూములు, నిర్మాణ రంగాలలో ఉన్నవారికి సంతృప్తిగానే ఉంటుంది. కొన్ని పనులు వాయిదా పడవచ్చు.
మీనం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్వయంవృత్తి, వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. అందరితో సత్సంబంధాలు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పనులు ప్రారంభించే ఆలోచనలలో సఫలీకృతులవుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి. వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in