మంగళవారం 07 జూలై 2020
Sports - Mar 27, 2020 , 07:50:39

ఫిట్‌నెస్ లో విరాట్ కోహ్లీయే నాకు స్ఫూర్తి

ఫిట్‌నెస్ లో విరాట్ కోహ్లీయే నాకు స్ఫూర్తి

న్యూఢిల్లీ: క్రికెటర్లకు టెక్నిక్‌తో పాటు ఫిట్‌నెస్‌ ఎంతో అవసరం అని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని చూశాకే తెలుసుకున్నానని సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ షెల్డన్‌ జాక్సన్‌ పేర్కొన్నాడు. కోహ్లీని కలవడానికి ముందు వరకు ప్లేయర్లకు టెక్నిక్‌ ఉంటే చాలు అనుకునేవాడిని. విరాట్‌ సహచర్యం నాలో చాలా మార్పులు తెచ్చింది. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన కోహ్లీ.. ఇప్పటికీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహిస్తాడని జాక్సన్‌ అన్నాడు. 2013 ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన జాక్సన్‌.. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు.

వరుసగా రెండో ఏడాది 800 పైచిలుకు పరుగులు చేసిన షెల్డన్‌.. ప్రస్తుతం సౌరాష్ట్ర ప్రధాన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది ఫైనల్లో తడబడ్డ సౌరాష్ట్ర ఈసారి టైటిల్‌ పోరులో బెంగాల్‌ను ఓడించి తొలిసారి రంజీట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. logo