శనివారం 16 జనవరి 2021
Sports - Dec 29, 2020 , 00:36:16

ఉమేశ్‌కు గాయం

ఉమేశ్‌కు గాయం

మెల్‌బోర్న్‌: కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. బాక్సింగ్‌ డే టెస్టులో చక్కటి ప్రదర్శన చేస్తున్న టీమ్‌ఇండియాకు గాయాల బెడద వీడేలా లేదు. సిరీస్‌కు జట్టు ఎంపిక చేయడానికి ముందే గాయం కారణంగా ఇషాంత్‌ శర్మ అందుబాటులో లేకుండా పోగా.. తొలి టెస్టులో బ్యాటింగ్‌ చేస్తూ గాయపడ్డ షమీ మిగిలిన సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక తాజాగా సోమవారం రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ వేస్తూ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ గాయపడ్డాడు. మూడు బంతులు వేశాక పిక్క కండరాలు పట్టేయడంతో కదల్లేకపోయిన ఉమేశ్‌.. నొప్పితోనే మైదానాన్ని వీడాడు. గాయం కారణంగా ఉమేశ్‌ మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది.