శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 19:19:20

గాయం కారణంగా మూడో వన్డేకు రీస్‌ టోప్లే దూరం..

గాయం కారణంగా మూడో వన్డేకు రీస్‌ టోప్లే దూరం..

లండన్: ఎడమ కాలి గాయం కారణంగా ఐర్లాండ్‌తో జరిగే మూడో వన్డేకు ఇంగ్లాండ్ బౌలర్ రీస్ టోప్లే దూరమయ్యాడు. దీంతో రాయల్ లండన్ సిరీస్ చివరి వన్డేలో అతడు ఆడడం లేదని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ ట్విట్టర్‌లో తెలిపింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టోప్లే ఒక వికెట్‌ తీశాడు. ఈ మ్యాచ్‌లో తొమ్మిది ఓవర్లు బౌలింగ్‌ చేసి 31 పరుగులు ఇచ్చాడు. 

ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు ఇప్పటికే గెలుచుకుంది. తొలి వన్డేను ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ రెండో వన్డేలో నాలుగు వికెట్లతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే మంగళవారం జరుగుతుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo